బాబుకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

మాలీవుడ్ నుంచి ఎంతో మంది నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ గా కెరీర్ ఆరంభించిన నటి పూర్ణ శ్రీ మహాలక్ష్మి చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో హర్రర్ మూవీ అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇటీవల పలు రియాల్టీ షోలో జడ్జీగా వ్యవహరించింది. తెలుగు ఇండస్ట్రీలో నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2004 లో మాలీవుడ్ లో మంజు పోలోరు పెంకుట్టి చిత్రంతో హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి తర్వాత సహాయ నటిగా నటించింది. అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. శ్రీ మహాలక్ష్మి చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో హర్రర్ మూవీ అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది పూర్ణ. గత ఏడాది దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. ఈ మద్యనే నటి పూర్ణకు సీమంతం ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. తాజాగా పూర్ణ పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటో తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. నటి పూర్ణ సోమవారం రాత్రి దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బెడ్ పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో నటి పూర్ణ ఓ ఫోటోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇక పూర్ణ గర్బవతి అయినప్పటి నుంచి ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమె సీమంతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మార్చి 30 న రిలీజ్ అయ్యింది.. ఇందులో విలన్ భార్యగా పూర్ణ ముఖ్యపాత్రలో నటించింది. తాజాగా నటి పూర్ణ బాబుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

%d