ప్రేమించా.. లవ్ లెటర్ రాశా.. సాయి పల్లవి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వేరు. ఫ్యాన్స్ కూడా ఆమెను మిగతా హీరోయిన్లలా కాకుండా చాలా ప్రత్యేకంగా చూస్తారు. దానికి కారణం.. ఆమె ఎంచుకునే పాత్రలు, అందులో ఆమె కనబరిచే నటన. ఈ రెండు క్వాలిటీస్ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. రెమ్యూనరేషన్ పెంచి ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేయడం ఆమెకు నచ్చదు. స్కిన్ షోకు కూడా చాలా దూరంగా ఉంటుంది. ఇంత సింపుల్ గా ఉండే ఈ అమ్మాయి జీవితంలో నిజంగా లవ్ అనేది ఉందా అనే విషయం తెలుసుకోవాలని అనిపించింది ఓ యాంకర్ కి. వెంటనే సాయి పల్లవిని ప్రేమ,పెళ్లి గురించి అడిగేసింది. దానికి సమాధానంగా సాయి పల్లవి.. “తన వరకూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. కానీ ఆ బంధాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని, అలాగే ప్రేమ పెళ్లి అయితే ఇంకా బాగుంటుందని తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. అంతేకాదు ఏడవ తరగతి చదువుతున్నప్పుడే ఓ కుర్రాడిని చాలా సీరియస్ గా లవ్ చేసిందట. తొలి చూపులోనే అతనిపై అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయట. మనసులో ఉన్న ఇష్టాన్ని నోటితో చెప్పలేక లవ్ లెటర్ కూడా రాసిందంట. కానీ ఆ లెటర్ ఇవ్వడానికి భయమేసి తన పుస్తకంలోనే దాచుకుందట.

For More News Click: https://eenadunews.co.in/

తీరా ఆ లెటర్ కాస్త సాయి పల్లవి వాళ్ళ అమ్మ చూసి బాగా కొట్టిందట. అయితే అలా కొట్టడం కూడా అదే మొదటిసారి..చివరి సారి కూడా అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఫ్యాన్స్ సాయి పల్లవి అంటే సైలెంట్ అనుకున్నాం కానీ ఫాస్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

%d