అంతా చైతునే చేశాడు – సమంత

హీరో నాగచైతన్యతో విడిపోయిన తరువాత మొదటిసారిగా సమంత తమ విడాకులపై స్పందించింది. తమ దాంపత్య జీవితంలో తన పోరాపాటు కానీ తప్పు గానీ ఏం లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తమ విడాకులపై సామ్ స్పందించడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మూవీ టీం ప్రారంభించింది. అందులో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్నారు. మొదటిసారి తన వైవాహిక జీవితం గురించి పెదవి విప్పారు. తన వైవాహిక బంధంలో పూర్తి నిజాయతీగా ఉన్నానుని, తన సైడ్ నుంచి ఎలాంటి తప్పులేదు, చిన్న పొరపాటు కూడా లేదని సమంత స్పష్టం చేశారు. ఆ బంధం వర్కౌట్‌ కాలేదన్నారు. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే తనకు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊ అంటావ పాట ఆఫర్‌ వచ్చిందన్న సమంత.. మొదట తాను సుకుమార్ గారికి నో అనే చెప్పానని, కానీ ఆ తర్వాత ఆలోచించి ఓకే చెప్పానన్నారు.

Leave a Reply

%d bloggers like this: