ఆ పనులు చేయడమే మైనస్ అయింది – యమున

నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎక్కువగా చేస్తూ వెళ్లిన కథానాయికల జాబితాలో యమున కూడా కనిపిస్తుంది. యమున పేరు చెప్పగానే ‘మౌన పోరాటం’ .. ‘పుట్టింటి పట్టుచీర’ .. ‘ఎర్ర మందారం’ .. ‘మామగారు’ వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. అలాంటి యమున తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.  ‘మౌన పోరాటం’ సినిమాలో ప్రధానమైన పాత్రకి గాను, చాలామంది పేర్లను పరిశీలించారు. కానీ ఆ పాత్రను నేను చేస్తేనే బాగుంటుందని రామోజీరావుగారు నాకు అవకాశం ఇచ్చారు. ఇక ఈటీవీ కోసం చేసిన ‘విధి’ .. ‘అన్వేషిత’ సీరియల్స్ నాకు చాలా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ‘విధి’లోని పాత్రను నేను చేయకూడదని అనుకున్నాను. కానీ సుమన్ గారు నాతోనే చేయించారు” అన్నారు. ” ఇక నేను పెద్ద హీరోల సరసన చేయకపోవడానికి కారణం ఏంటని చాలామంది అడుగుతున్నారు. నేను గ్లామరస్ పాత్రలు చేయకపోవడం .. ఎమోషనల్ రోల్స్ ఎక్కువగా చేయడం అందుకు కారణమై ఉంటుందని అనుకుంటున్నాను. డీ గ్లామర్ రోల్స్ కి యమున బాగుంటుందనే ఇమేజ్ రావడం కూడా నాకు మైనస్ అయింది” అని చెప్పుకొచ్చారు. గతంలో వ్యభిచారం చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇదే యమునకు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: