హిండెన్‌బర్గ్(Hindenburg) నివేదిక భారత బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani)పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆయన నికర ఆస్తి విలువ సగానికి పైగా క్షీణించింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) ప్రకారం.. ప్రస్తుతం అదానీ సంపద విలువ 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఆయన మొత్తం సంపద విలువ 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే రూ.4 లక్షల కోట్ల దిగువకు క్షీణించింది.
కాగా నెల రోజుల క్రితం 60 ఏళ్ల అదానీ 120 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించిన తర్వాత ఆయన సంపద క్రమంగా కరుగుతూ వచ్చింది. ఇప్పుడు సగానికి పైగా క్షీణించి 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది.