భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య

వెర్రితనం అనాలో, అవివేకం అనాలో, అజ్ఞానం అనాలో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలు, కారణాలకే కొందరు చనిపోతున్నారు. క్షణికావేశంలో, మనస్తాపంతో వెలకట్టలేని ప్రాణాలను తీసుకుంటున్నారు. చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. తాజాగా.. భార్య చికెన్ వండలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది.

For More News Click: https://eenadunews.co.in/

భార్య చికెన్ వండలేదనే చిన్నపాటి విషయానికే మనస్తాపంతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఈ ఘటన జరిగింది. పవన్ అనే వ్యక్తి రాత్రి వేళ ఇంటికి వెళ్తూ వెళ్తూ చికెన్ పట్టుకెళ్లాడు. ఆ చికెన్ ను భార్యకు ఇచ్చి వండమని చెప్పాడు. అయితే, అందుకు భార్య నిరాకరించింది. చికెన్ వండేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంతే, క్షణాకావేశానికి లోనైన పవన్.. ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. కాగా, పవన్ దంపతులకి రెండేళ్ల కూతురు ఉంది.

 

Leave a Reply

%d