మూడు రోజులు కేబుల్ బ్రిడ్జి బంద్

మూడు రోజుల పాటు రాయదుర్గం కేబుల్ రాకపోకలు నిషేదించారు. కేబుల్ బ్రిడ్జ్ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా బ్రిడ్జిపై భారీ యంత్రాలతో మరమ్మతులు చేపడుతుండటంతో రాకపోకలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 6 అర్థరాత్రి నుంచి అంటే ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 10 వ తేదీ ఉదయం వరకు బ్రిడ్జిని మూసేస్తున్నట్లు తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్‌ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరికరాలు, యంత్రాలు ఆ ప్రదేశంలో వాడబడతాయని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్‌ సూచించారు. జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు సూచించారు.

Leave a Reply

%d