ఈమె మాములు లేడీ కాదండి! ఏకంగా భర్త స్నేహితుడిపై కన్నేసి

జయకృష్ణ ఆ ఆల్విన్ కాలనీలోనే జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. దుర్గభవానీ ఇంట్లోనే ఉండేది. ఇక ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా గడిపారు. ఇదిలా ఉంటే జయకృష్ణ స్నేహితుడైన చిన్నా అనే వ్యక్తి అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తూ ఉండేవాడు. వీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిస ఉండేవారు. అయితే చిన్నా ఇంటికి వస్తున్న క్రమంలోనే దుర్గా భవానీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అలా తన భర్త కు తెలియకుండా వ్యవహారం అంతా నడిపించింది. ఆర్థిక ఇబ్బందులు తెలెత్తడంతో జయకృష్ణ 25 రోజుల క్రితం తన సొంత ఊరుకి వెళ్లాడు. హైదరాబాద్ ఉండడం వీలుకాకపోవడంతో అతడు సొంతూరికి వెళ్దామని భార్య దుర్గా భవానికి వివరించాడు.

దీనికి ఆ మహిళ మాత్రం నిరాకరించింది. దుర్గా భవాని ఇదే విషయాన్ని తన ప్రియుడు చిన్నాకు వివరించింది. ఇక ఇద్దరు కలిసి జయకృష్ణను హత్య చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే స్నేహితుడైన చిన్నా జయకృష్ణకు ఇటీవల ఫుల్ గా మద్యం తాగించారు. అతడు మద్యం మత్తులోకి వెళ్లగానే జయకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఆ తర్వాత ఏం తెలియదన్నట్లుగా అప్పుల బాధతో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని దుర్గా భవాని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ఎందుకు మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా భార్య దుర్గభవాని, ఆమె ప్రియుడు చిన్నా ఇద్దరు కలిసి అతడిపై పెట్రోల్ పోసి హత్య చేశారని తేలింది. నిందితులు కూడా చేసిన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Leave a Reply

%d bloggers like this: