భార్య-భర్తల మధ్య గొడవ.. చివరకు రెండు ప్రాణాలను బలి తీసుకుంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో భార్యదే తప్పు కావడం విశేషం. ఇంతా చేసి, ఆమె ఏమైనా బాగుంపడిందా అంటే అదీ లేదు. దారుణ స్థితిలో హత్యకు గురి అయ్యింది.
రేణుకకు ఏడేళ్ల క్రితం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని సూరారాం విశ్వకర్మ కాలనీకి చెందిన సురేష్‌తో ఘనంగా వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం జీవితం ప్రశాంతంగానే గడిచిపోయుంది. రేణుక ఆలోచనల్లో మార్పు వచ్చింది. భర్తని లెక్క చేయకుండా గొడవ పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. రేణుక వేరే ఇంటికి వెళ్లిపోయింది. కోపంతో వెళ్లిన భార్య తిరిగి వస్తదిలే అన్న ఆశతో ఎదురుచూడ సాగాడు భర్త. కానీ.., రేణుక ఇంతలో ఓ వాచ్ మెన్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కట్ చేస్తే.. అమ్మడి మ్యాటర్ భర్త దగ్గరికి చేరింది. ఆవేశంతో ఊగిపోయాడు సురేష్. మారకపోతే ప్రాణాలు తీస్తా అంటూ భార్యని బెదిరించాడు.
భర్త ఎక్కడ అన్నంత పని చేస్తాడో అనే భయంతో రేణుక.. మరో మహిళ సహాయంతో భర్తని అతి కిరాతకంగా చంపేసింది. ఈ కేసులో రేణుక జైలుకి వెళ్లి, బెయిల్ పై బయటకి వచ్చింది. క్షణికా ఆవేశంలో భర్తని చంపాను అన్న భీతి రేణుకలో లేకుండా పోయింది. బయటకి వచ్చాక ఆమె ఆనందాలకు అడ్డు చెప్పేవారే కరువయ్యారు. తన రాసలీలు సాగించడం కొనసాగించింది. కానీ.., రోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం మాత్రం పెట్టి వస్తుండేది. తాజాగా.. అలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి ఇంటికి చేరుకుంది రేణుక. తరువాత బయట ఏదో పని ఉంది అంటూ.. బంధం చెరుకు కట్ట మీదకి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె అక్కడికి వెళ్లిందో, ఎవరైనా బలవంతంగా లాక్కొని వెళ్లారో తెలియదు గాని.., రేణుక అక్కడ హత్యకి గురైంది
స్థానికులు అక్కడ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకి వచ్చింది. రేణుక కాల్ హిస్టరీని పరిశీలిస్తే.. ఆమె ఫోన్ నుండి లాస్ట్ కాల్ మరిదికి వెళ్లి ఉంది. అతను భర్త తమ్ముడు. దీంతో.. పోలీసులు రేణుకది అనుమానాస్పద కేసుగా గుర్తించి, విచారణ వేగవంతం చేశారు. భర్త సురేష్ తో సరిగ్గా ఉండి, శుభ్రంగా కాపురం చేసుకుని ఉంటే.. నేడు వారిద్దరూ ప్రాణాలు కోల్పోయేవారు కాదు. పిల్లలు అనాధలు అయ్యే వారు కాదు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.