ఎంఐఎం అక్బరుద్దీన్ వియ్యంకుడి ఆత్మహత్య

ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచరం మేరకు ఓ వైద్యుడు తుపాకీతో కాల్చుకున్న ఘటన కలకలం రేపింది. డాక్టర్ మజారుద్దీన్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.7లో నివసిస్తున్నారు. ఆయన పాయింట్ బ్లాంక్ రేంజిలో తుపాకీతో కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ మజారుద్దీన్ ను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  పోస్టుమార్టం నిమిత్తం డాక్టర్ మజారుద్దీన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో గొడవల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వియ్యంకుడు అని తెలుస్తోంది. ఆసుపత్రికి వద్దకు అక్బరుద్దీన్ కూడా వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

%d bloggers like this: