అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు

రాత్రి పూట మెట్రో సేవల సమయాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాంప‌ల్లి నుమాయిష్ సంద‌ర్భంగా మెట్రో రైలు వేళ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు రైళ్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఎల్బీన‌గ‌ర్ – మియాపూర్, నాగోల్ – రాయ‌దుర్గం మార్గాల్లో స‌మ‌యం పొడిగించారు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు చివ‌రి మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. గంట లోపు గ‌మ్య‌స్థానానికి చేరుకోనున్నాయి. గాంధీ భ‌వ‌న్ మెట్రో స్టేష‌న్‌లో టికెట్ బుకింగ్ కౌంట‌ర్ల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: