ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచి.. చివరికి

మత్తుకు  బానిసైన వ్యక్తి  ఇంటి ఆవరణలోనే సెటప్ చేశాడు.  పూల మొక్కల తరహాలో గంజాయి మొక్కలను పెంచేశాడు.  మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ వీధిలో అదోరకమైన వాసన గుప్పుమంది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అంతే అయ్యగారి బండారం బయటపడింది. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, వనస్థలిపురం పోలీసులు అకస్మాత్తుగా అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. పూల మొక్కల మధ్యలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. 10 మొక్కలను పెకలించి.. స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇంట్లో దాచిన 300 గ్రాముల గంజాయి విత్తనాలను కూడా సీజ్ చేశారు. నిందితుడిని  అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువకుడు గంజాయికి బానిసైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు

For More News Click: https://eenadunews.co.in/

మత్తు పదార్ధాలు మాయలో ముంచేస్తాయనడానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. సిగరెట్ కు అలవాటైన వారు బడ్డీ కోట్లవైపు.. మందుకు బానిసైన వారు వైన్ షాపుల వైపు చూస్తుంటారు. ఇక ఇప్పుడు హైటెక్ యుగంలో గంజాయి చాప కింద నీరులా మారి పెనుముప్పుగా తయారైంది. ఇది ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికేస్తుంది. ఇది ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుందని గంజాయి ప్రియులు చెబుతుంటారు.

For More News Click: https://eenadunews.co.in/

చాలామంది యూత్‌.. గంజాయి వైపు అడిక్ట్ అయ్యారు. సీరియస్‌గా తీసుకున్న సర్కార్ గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నారు. కొంచెం అనుమానం ఉన్నా మెరుపు దాడులు చేస్తున్నారు. దీంతో ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ యువకుడు వనస్థలిపురం పరిధిలోని గాంధీనగర్‌లో గల తన ఇంట్లోనే పెరట్లో గంజాయి మొక్కల పెంపకం షురూ చేశాడు.

Leave a Reply

%d bloggers like this: