హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వెలిసిన మర్ధన సెంటర్లపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా మర్ధన పేరుతో వ్యభిచారం చేయిస్తున్న స్పా, వెల్ నెస్, థాయ్ మసాజ్ సెంటర్లపై వరుసుగా దాడులు చేస్తున్నారు. సిసిఎస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ సంయుక్తంగా ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పరిధిలోని రువాన్ థాయ్ స్పా, హెవెన్ ఫ్యామిలీ స్పా, మేఘావి వెల్ నెస్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్ నెస్ స్పా సెంటర్లపై కేసులు నమోదు చేశారు. అనంతరం నిర్వహకులను అరెస్ట్ చేశారు. అందులో పని చేస్తున్న మహిళలలను రెస్య్కూ హోంకు తరలించారు. ఈ దాడులు ఈ నెల మొత్తం జరుగుతాయని తెలుస్తోంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఉండడంతో పోలీసులు ఏ మాత్రం అలసత్వాని తావివ్వకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్న వారిని కటకటాల్లోకి నెడుతున్నారు.
మర్ధన పేరుతో వ్యభిచారం, పోలీసులు దాడులు
