బాలీవుడ్ నటి కశ్మీరా షా తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. దక్షిణాదిలో తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది. హిందీ బిగ్ బాస్, నాచ్ బలియే, ఫియర్ ఫ్యాక్టర్ వంటి షోలలో కూడా ప్రేక్షకులను అలరించింది. 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ ను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత వీరిద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో బాలీవుడ్ నటుడు టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ ను పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక కీలక విషయాన్ని పంచుకుంది. రెండో భర్తతో పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని తెలిపింది. ఐవీఎఫ్ ద్వారా కూడా తల్లి అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదని చెప్పింది. ఈ క్రమంతో పిల్లలు లేరని తాను బాధపడుతుండగా సల్మాన్ ఖాన్ తనకు ఒక సూచన చేశారని, ఆయన సలహాతో తాను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని తెలిపింది. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించమని సల్మాన్ చెప్పారని… ఆయన సలహాతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తాము తల్లిదండ్రులమయ్యామని చెప్పింది.
సల్మాన్ ఖాన్ సలహాతోనే తల్లిని అయ్యాను: కశ్మీరా షా
