అప్పుడు నేను వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉన్న – కాజల్

బాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్స్ లో కాజోల్, అజయ్ దేవగణ్ ల జంట ఒకటి. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరికీ ఒక అమ్మాయి. ఒక అబ్బాయి ఉన్నారు. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోస్ట్ కాడ్ లో కాజోల్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడించింది. తన భర్త అజయ్ దేవగణ్ తొలిసారి తనను కలిసే సమయంలో తాను మరొక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. ఆ సమయంలో అజయ్ కూడా మరో వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాడనుకుంటానని చెప్పింది.  తమ తొలి సినిమా సెట్స్ లో ఎక్కువ సేపు గడపడం వల్ల ఇద్దరి మధ్య చనువు ఏర్పడిందని కాజోల్ చెప్పింది. ఇద్దరం మంచి స్నేహితులం అయ్యామని… ఆ తర్వాత తాను డేటింగ్ చేస్తున్న వ్యక్తితో తాను బ్రేకప్ అయ్యానని, అదే విధంగా అజయ్ కూడా బ్రేకప్ అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత ఇద్దరం ఇంకా మంచి స్నేహితులం అయ్యామని చెప్పింది. మీకు సరైన వ్యక్తి అజయేనా అనే ప్రశ్నకు సమాధానంగా… ఆ విషయం అజయ్ చెప్పాలని సరదాగా వ్యాఖ్యానించింది. ‘హల్ చల్’ సినిమాలో కాజోల్, అజయ్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1999లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు, 2010లో కొడుకు పుట్టారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు.

Leave a Reply

%d