కోటి రూపాయల లంచం తీసుకున్న ఐఏఎస్

అవినీతి కేసులో గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ధర్మేందర్ సింగ్ ను  హర్యానా పోలీసులు మే 15వ తేదీన  అరెస్టు చేశారు.  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఫరీదాబాద్ పోలీసుల కంబైండ్  ఆపరేషన్‌లో అతన్ని పట్టుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని హర్యానా భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఇవాళ అతడిని  సిటీ కోర్టులో ప్రవేశ పెట్టారు.  నిందితుడు ధర్మేందర్ సింగ్ సోనిపట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.10 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా నిందితులు అనుమతి కోసం టెండర్ మొత్తాన్ని ₹ 55 కోట్ల నుండి ₹ 87 కోట్లకు అక్రమంగా పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి.

For More News Click: https://eenadunews.co.in/

ఐఏఎస్ అధికారి ధర్మేందర్ సింగ్ అవినీతి కేసులో అరెస్టయ్యారని, ఆయనను మంగళవారం సిటీ కోర్టులో హాజరు పరుస్తామని ఫరీదాబాద్ పోలీసు అధికార ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. సోనిపట్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఐఏఎస్‌ అధికారి సింగ్‌ ఓ భవన నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని చెప్పారు. 52 కోట్ల టెండర్ మొత్తాన్ని 87 కోట్లకు పెంచినట్లు  తెలిపారు.

Leave a Reply

%d