‘పాయా’ కోసం ఏం జరిగిందో తెలిస్తే.. షాక్ అవుతారు

స్థానిక తిరువొత్తియూరు కనక్కర్‌ వీధిలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో వెళ్ళిన ఐదుగురు పోలీసులు పరోటాకు ‘పాయా’(paya) కావాలని పట్టుబట్టారు. అప్పటికే అర్ధరాత్రి కావటంతో ‘పాయా’ లేదని సిబ్బంది ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. హోటల్‌ సిబ్బంది, యజమానితో గొడవపడ్డారు. పోలీసుల గలాభాను చూసి హోటల్‌కు వెళ్ళిన కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. తాగిన మైకంలో హెడ్‌కానిస్టేబుల్‌ కోట్టముత్తు, కానిస్టేబుల్‌ ధనశేఖర్‌ సహా ఐదుగురు పోలీసులు సిబ్బందితో గొడవపడిన సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా(CC camera) వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ సృష్టించాయి. దీనితో పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ రంగంలోకి దిగి హెడ్‌కానిస్టేబుల్‌ కోట్టముత్తు, కానిస్టేబుల్‌ ధనశేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. మిగిలిన ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోమంటూ తిరువొత్తియూరు పోలీసుస్టేషన్‌ అధికారులకు ఉత్తర్వు జారీ చేశారు.

Leave a Reply

%d