పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా డి’క్రూజ్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది.. సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఇలియానానే ఈ విషయం వెల్లడించింది. బుధవారం ఇలియానా చేసిన ఇన్ స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఇలియానా రెండు ఫొటోలను షేర్ చేసింది. ఒక ఫొటోలో ‘అడ్వెంచర్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఉన్న టీషర్ట్ ఉండగా.. మరో ఫొటోలో తన మెడలో వేలాడుతున్న ఓ పెండెంట్ ను చూపించింది. ఆ పెండెంట్ పై మామా (అమ్మ) అనే ఇంగ్లిష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల కింద ‘కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ జతచేసింది. మై లిటిల్ డార్లింగ్.. నిన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఇలియానా తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇలియానాకు అభినందనలు చెబుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ బిడ్డ తండ్రిని పరిచయం చేయాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. అయితే, 2019లో వాళ్లు విడిపోయారని ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ తో ఇలియానా ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై ఇలియానా స్పందించలేదు. ప్రస్తుతం కూడా తను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కానీ తండ్రి ఎవరనేది కానీ, పెళ్లి విషయం కానీ చెప్పలేదు. కాగా, తల్లి కాబోతున్నానంటూ ఇలియానా చేసిన పోస్టుకు ఆమె తల్లి సమీరా కూడా కామెంట్ చేశారు. మనవడు/ మనవరాలికి స్వాగతం చెప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నానంటూ డ్యాన్సింగ్ ఎమోజీతో కామెంట్ చేశారు.

Leave a Reply

%d bloggers like this: