విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయట పడింది. బలహీనుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారి అంతర్గత అవయవాలకు బేరం కుదిర్చి, మారు బేరానికి అమ్మేసిన గ్యాంగ్ గుట్టు బయటపడింది. ఒప్పందం మేరకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన డాక్టర్, మరో మధ్యవర్తి మీద బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. విశాఖ వాంబే కాలనీకి చెందిన టాక్సీ డ్రైవర్ ఆర్థిక సమస్యలతో తన కిడ్నీ అమ్మేసెందుకు సిద్ధమయ్యారు. దీనికి కామరాజు అనే మధ్యవర్తి ద్వారా ఎనిమిదిన్నర లక్షలు వచ్చేలా బేరం కుదిరింది. అయితే రెండున్నర లక్షలు ఇచ్చి కిడ్నీ(Kidney) తీసుకుని మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
For More News clink the link: https://eenadunews.co.in/
వాస్తవానికి కిడ్నీ ఇవ్వడానికి అడ్వాన్స్ తీసుకున్న వినయ్ కుమార్ విషయం కుటుంబీకులకు తెలిసి ఆయన్ను వద్దని వారించగా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆల్రెడీ అటు మారు బేరం సెట్ చేసుకున్న కామరాజు తన ఆదాయం పోతుందన్న బాధతో వినయ్ కుమార్ ను కిడ్నాప్ చేసి పెందుర్తిలోని తిరుమల ఆస్పత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ పరమేశ్వర రావు సారథ్యంలో కిడ్నీ బలవంతంగా తొలగించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అసలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం అవయవాల మార్పిడి చాలా పెద్ద నేరం. మరి ఈ పరమేశ్వర రావు, తనది కాని సబ్జెక్టులో ఎలా దూరారు. వేరే డాక్టర్ ను రప్పించి ఇలా కిడ్నీ లాగేశారా.. ఇంతకుముందు కూడా ఇలాంటివి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.