భవిష్యత్తులో.. స్టార్ట్‌పలు పదింతలు

యూనికార్న్‌ల ని ర్మాణం, స్టార్ట్‌పల ఏర్పాటు విషయంలో భారత దేశం అద్భుతమైన పురోగతి సాధించిందంటూ వచ్చే నాలుగైదు సంవత్సరాల్లోను ఈ వృద్ధి ఇలానే ఉంటుందని, స్టార్ట్‌పల సంఖ్య పదింతలు కావచ్చని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. జీతో ఇంక్యుబేషన్‌, ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌(జేఐఐఎఫ్‌) నిర్వహించిన ఆరవ ఇన్వెస్టర్‌/స్టార్టప్‌ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ స్టార్ట్‌పలు, యూనికార్న్‌లు ఏఐ, వెబ్‌ 3, డీప్‌ టెక్‌ వంటి వర్థమాన టెక్నాలజీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లు స్టార్ట ప్‌లు, యూనికార్న్‌ల శకమేనని ఆయనఅన్నారు. వచ్చే నాలుగైదు సంవత్సరాల కాలంలో యూనికార్న్‌ల సంఖ్య ప్రస్తుత 108 నుంచి 10,000కి చేరవచ్చని, మొత్తం స్టార్టప్‌ల సంఖ్య లక్ష దాటుతుందని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు రాజీవ్‌ చెప్పారు.

  • ఓస్వాల్‌ పోష్కెమ్‌ అనుబంధ సంస్థ క్రిషానా పోష్కెమ్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మార్కెట్లోకి భారత్‌ డీఏపీ, భారత్‌ ఎన్‌పీకే బ్రాండ్‌ పేరుతో రెండు కొత్త కాంప్లెక్స్‌ ఎరువులను విడుదల చేసింది. ప్రధాన డిస్ట్రిబ్యూటర్‌ అయిన మునారా ఆగ్రో టెక్నాలజీస్‌ ద్వారా ఈ ఉత్పత్తులు రెండు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయని క్రిషానా తెలిపింది.

Leave a Reply

%d