కొత్త వైరస్ ఇద్దరి మరణం

కరోనా సంక్షోభం సమసిపోయింది అనుకునేంతలో మరో వైరస్ కలకలం మొదలైంది. దేశంలో గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి అధికమైంది. ఇప్పటికే రెండు మరణాలు సంభవించిన నేపథ్యంలో, కేంద్రం అప్రమత్తమైంది.  హెచ్3ఎన్2… ఇన్ ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం వెల్లడించింది. పిల్లలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులు ఈ హెచ్3ఎన్3 వైరస్ కు త్వరగా గురవుతారని వెల్లడించింది.  ఈ వైరస్ భారత్ కు కొత్తకాదని, దేశంలో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు దీని వ్యాప్తి కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరించింది. కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ, మార్చి చివరి కల్లా హెచ్3ఎన్2 కేసులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.  తాజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించింది.

Leave a Reply

%d