చిలిపి ఎమ్మెల్యేకు ఈ సారి టిక్కెట్ కష్టమేనా ?

తెలంగాణలో మహిళల సాధికారత, చట్టసభల్లో అవకాశాల కోసం భారస పార్టీ ఎమ్మెల్సీ దీక్ష చేస్తుంటే… మరోవైైపు అదే పార్టీలోని ఎమ్మెల్యే తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్న ఘటలను పార్టీకి తలవంపు తీసుకోచ్చి పెడుతున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ ని ఎమ్మెల్యే లైంగిక వేధిస్తున్నారని మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది. అయితే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే టిక్కెట్లు రావడం కష్టమని తేల్చి చెప్పేశారు. అయితే గతంలో కూడా ఆ చిలిపి ఎమ్మెల్యే చేసిన కొంటే పనులు కేసీఆర్ తో పాటు పార్టీ పరువును తీశాయి. అయితే ఇప్పుడు కవిత మహిళల కోసం పోరాడడం మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే మహిళలను వేధించడం లాంటి సంకేతాలు ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి మరీ.

Leave a Reply

%d