‘హీలింగ్ హస్త’ ఎదుగుదలకు అపార అవకాశాలు

వేగంగా అభివృద్ధి చెందుతున్న, ప్రముఖ ప్రకృతి వైద్య క్లినిక్, రిటైల్ నేచురల్ ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల తయారీ సంస్థ ‘హీలింగ్ హస్త హెర్బల్ కాన్సెప్ట్స్’ వ్యాపార ప్రణాళికతో కూడిన ఒక నివేదికను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లోని సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ బుధ‌వారం విడుదల చేసింది. హీలింగ్ హస్త రిటైల్ ఆరోగ్య ఉత్పత్తుల విభాగం వచ్చే ఐదేళ్లలో 10 రెట్లు పెరుగుతుందని, 2027-2028 నాటికి 2.5 కోట్ల డాలర్ల ఆదాయాన్ని చేరుకుంటుందని ఈ నివేదిక‌లో అంచనా వేశారు.

అత్యంత విజయవంతమైన మై డాక్టర్ నొప్పి నివారణ నూనె ఆవిష్కర్త అయిన హీలింగ్ హస్త మరింత వృద్ధి చెందడానికి దాని మిగిలిన‌ ఉత్పత్తులు తోడ్పడతాయి. అవి.. ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే రెల్క్స్ నూనె, శృంగార సమయంలో శీఘ్రస్ఖలనం సమస్యను నివారించే సిక్స్-ఈ టాబ్లెట్లు, జుట్టు రాలడాన్ని, చీలిక జుట్టు సమస్యలకు చికిత్స అందించే పేటెంట్ పొందిన ఆయుర్వేద నూనె కైదర్యా హెర్బల్ హెయిర్ ఆయిల్, టైట‌స్‌ స్లిం పౌడర్, డాక్టర్ ఎం నొప్పి నివారణ ఉత్పత్తులు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, బ‌య‌ట కూడా పెద్ద మార్కెట్ ను ఆక్రమించే సామర్థ్యం ఈ ఉత్పత్తుల శ్రేణికి ఉంది.

ఈ సందర్భంగా ఐఎస్‌బీ సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ ప్రొఫెసర్ డీవీఆర్ శేషాద్రి మాట్లాడుతూ “హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హీలింగ్ హస్త తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. హీలింగ్ హస్త మార్కెట్లలోకి తీసుకెళ్లాలనుకుంటున్న ఉత్పత్తులకు మార్కెట్ సామర్థ్యం, పోటీ విశ్లేషణపై సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ లో మేము సమగ్ర అధ్యయనం చేశాం. ఆయుర్వేద ఉత్పత్తులకు దేశంలో బలమైన మార్కెట్ ఆమోదం ఉంది. ఇది దీర్ఘకాలంలో మరింత పెరుగుతుందని మా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలోని అనేక ప్రముఖ సంస్థలు ఈ త‌ర‌హా ఉత్ప‌త్తుల‌ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయి, హీలింగ్ హస్త అందించే ప్రత్యేకమైన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్, ప్రచార ప్రణాళికలు ఉంటే భారతదేశంలో కొత్త మార్కెట్లను ఆక్రమించే అవకాశం ఉంది” అని తెలిపారు.

 

 

 

 

Leave a Reply

%d bloggers like this: