పనిమనిషికి ముద్దు పెట్టి ఐటి ఉద్యోగి

ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యంలో ప‌ని చేసే ఓ ఉద్యోగి.. అక్క‌డ ప‌ని చేసే ఓ ప‌నిమ‌నిషి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న గ‌దిని శుభ్రం చేసేందుకు పిలిచి, ఆమెను గ‌ట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని నుంగ‌బాక్కంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నుంగ‌బాక్కంలోని ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యంలో రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్ట‌న్‌(36) సీనియ‌ర్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఇదే ఆఫీసులో భ‌ర్త‌ను కోల్పోయిన ఓ మ‌హిళ ప‌ని మ‌నిషిగా ప‌ని చేస్తోంది. గ‌త ఐదేండ్ల నుంచి అక్క‌డ ప‌ని చేస్తున్న ఆమెపై రోక్స్ కన్నేశాడు. ఈ క్ర‌మంలో త‌న గ‌దిని పిలిపించుకున్నాడు. రూమ్‌ను శుభ్రం చేయాల‌ని ఆదేశించి, గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు కూడా పెట్టేశాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత మ‌హిళ‌.. రోక్స్ త‌న‌ను ఇబ్బంది పెడుతున్నాడ‌ని ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసింది. వారు ప‌ట్టించుకోలేదు. చేసేదేమీ లేక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

 

 

Leave a Reply

%d