జబర్దస్త్ ముక్కు అవినాష్ తల్లికి గుండెపోటు

‘జబర్దస్త్‌’ షో కమెడియన్‌ ముక్కు అవినాష్ తల్లి మల్లమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లడంలో డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమెకు పలుమార్లు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు. గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. వెంటనే ఆమెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముక్కు అవినాష్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. తల్లి ఆరోగ్య సమస్యలకు కారణాలు, అందించిన వైద్యం గురించి పలు వివరాలు వెల్లడించారు.

ముక్కు అవినాష్ తల్లి మల్లమ్మ ఊళ్లోనే నివాసం ఉంటున్నారు. అయితే, కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. తరచుగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయం తెలిసిన ఆవినాష్ ఆమెను హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. అస్వస్థతకు గురవ్వడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తేలింది. గుండెలో బ్లాక్స్ ఏర్పడినట్లు గుర్తించారు. వాటిని సరిచేసేందుకు వైద్యులు రెండు స్టంట్లు వేశారు.

“ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండే అమ్మ ఇలా బాధపడుతోంది. నవ్వు ముఖం మాత్రం ఉండే అమ్మకు ఇప్పుడు ఇలా కావడం బాధ కలిగిస్తోంది. ఆమె చాలా రోజులుగా షుగర్ వ్యాధి ఉంది. దీనికి కారణంగా ఆహారం కూడా సరిగా తినడం లేదు. ఈ మధ్యే అమ్మకు గుండె పోటు కూడా వచ్చింది. ముందు ఊళ్లో టెస్టులు చేయిస్తే గుండె బలహీనంగా ఉందని చెప్పారు. వెంటనే హైదరాబాద్ కు తీసుకొచ్చి పరీక్షలు చేయించాను.  ఆంజియోగ్రామ్ కూడా చేశారు. గుండె సమస్యల కారణంగా స్టంట్లు వేశారు. ఇప్పుడు అమ్మను జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది” అని అవినాష్ తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చారు.

Leave a Reply

%d