‘ఒక దేశం ఒకే ఎన్నిక’ కమిటీపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి నియమితులయ్యారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
జమిలి ఎన్నికల కమిటీ
