అమ్మ ఒడి నిధుల విడుదల బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తాజాగా జనసేన అధినేత కౌంటర్ ఇచ్చారు. సరిగ్గా అక్షరాలు రాని ముఖ్యమంత్రి ఉండడం తెలుగు రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని అన్నారు. వరాహికి.. వారాహికి కనీసం తేడా తెలియదా అని అన్నారు. తాను గతంలో చెప్పు తీసి చూపించి మాట్లాడానంటే దాని వెనక చాలా జరిగిందని అన్నారు. తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ బాధపడిపోతున్నారని, ఇక నుంచి జగన్ స్టైల్ లోనే మాట్లాడతానని అన్నారు. అసలు అమ్మ ఒడి లాంటి కార్యక్రమంలో సీఎం జగన్ అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని కౌంట్ వేశారు.
” అ నుంచి అం, అ: వరకూ అక్షరాలు రావు. దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి నేనే దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తా. అలాంటి ఒక నియంత, ఒక కంఠకుడు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండడం బాధాకరం. ” అని పవన్ కళ్యాణ్ అన్నారు.