ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వీరి భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జీవో నంబర్ 1, చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పవన్ భేటీ అయ్యారని తెలుస్తుంది. మరోవైపు ఈ భేటీలో పొత్తుల అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చి పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరపాలని ఇద్దరు అధినేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు బాబు , అటు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒక్కటే. అధికార పార్టీ వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా ఇద్దరు నాయకులు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పవన్ అనేక సార్లు పొత్తుల విషయంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైకాపా వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేది లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో పొత్తులపై అనేక ఊహాగానాలు వినిపించాయి. పవన్ వ్యాఖ్యలను బట్టి పొత్తులు ఉంటాయని తెలుస్తున్న ఆ పార్టీలు ఏంటి? సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అందుకేనట
