రజనీ చెల్లెలుగా జీవిత రాజశేఖర్

జీవిత రాజశేఖర్ ఒకప్పుడు కథానాయికగా భారీ హిట్స్ చూశారు. ఆ తరువాత రాజశేఖర్ సినిమాలకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఇద్దరు పిల్లలూ హీరోయిన్స్ గా మారడంతో, వారికి సంబంధించిన కథలను వింటూ ..  వాళ్లను గైడ్ చేస్తూ వెళుతున్నారు. అలా బిజీగా ఉండటం వలన ఈ మధ్య కాలంలో జీవిత రాజశేఖర్ తెరపై కనిపించలేదు. నటనకి దూరంగా ఉన్న ఆమె, మళ్లీ తెరపై కనిపించనున్నారు .. అదీ రజనీకాంత్ సినిమాలో కావడం విశేషం. అవును .. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రలో జీవిత కనిపించనున్నారు. రజనీ హీరోగా రూపొందుతున్న ‘లాల్ సలామ్’ సినిమాకి ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ చెల్లెలి పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో జీవితను ఎంపిక చేసుకున్నారు. చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో మార్చి 7వ తేదీ నుంచి జీవిత జాయిన్ కానున్నారు. లైకా – రెడ్ జెయింట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ  సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతుండటం విశేషం.

Leave a Reply

%d