ఇనార్బిట్ మాల్‌లో జేపోర్ స్టోర్‌

హైదరాబాద్ లో ప్రత్యేకమైన మాల్ ఇనార్బిట్ మాల్ ఒకటి. ఈ మాల్ లో జేపోర్ తన రెండవ స్టోర్ ని ప్రారంభించింది. ఈ సంధర్భంగా జేపోర్ బిజినెస్ హెడ్, రష్మి శుక్ల మాట్లాడుతూ… “సృజనాత్మకత మరియు గొప్ప వారసత్వము కలిగిన నగరం హైదరాబాద్. ఇక్కడే మా రెండవ స్టోర్ ప్రారంభించటానికి మేమెంతో ఆనందిస్తున్నామని పేర్కొన్నారు.  జేపోర్ లో సంప్రదాయిక రీటెయిల్ నమూనాను దాటి వెళ్తాము – మేము కేవలం ఉత్పత్తుల సరఫరాదారు మాత్రమే కాదు, కాని చేతివృత్తుల జీవనశైలి యొక్క స్వరూపము. ఈ దుకాణము, రీటెయిల్ చోటు కంటే ఎక్కువగా, హస్తకళల శాఖలను దగ్గరగా చూచుటకు, నిమగ్నము అయ్యేందుకు మరియు మనస్ఫూర్తిగా సొంతం చేసుకొనుటకు వినియోగదారులను ఆహ్వానించే అనుభవపూర్వకమైన పునరుద్ధరణ జరిగే ప్రదేశము. మా విస్తరణ ప్రయత్నాల మూలాలు భారతదేశపు చేతివృత్తుల వారసత్వాన్ని పరిరక్షించడము మరియు పునరుజ్జీవింపజేయడములో మా అచంచలమైన విశ్వాసములో ఉన్నాయి. జేపోర్ ద్వారా, పురాతన టెక్నిక్స్ మరియు ఆధునిక సున్నితత్వాల మధ్య ఖాళీని పూరించుటకు సంప్రదాయిక కళాకారులకు అధికారము ఇవ్వబడుతుంది. తద్వారా వారసత్వాన్నిఆధునికతలోకి నడిపించే సహజీవన మార్పిడి పెరుగుతుంది.”

Leave a Reply

%d