ఈ కాలంలో ఒక్క భార్యతో కాపురం చేయడమే కష్టంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబం ఆలనా, పాలనా చూసుకోవడం కష్టమే కానీ ఒక మహాఘనడు ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకొని చరిత్ర పేజీల్లోకి ఎక్కాడు. 11 మంది మాత్రం నీతో భరించలేం బాబోయ్ అంటూ వదిలేసి పోతే.. పన్నెండో ఆమె చక్కగా కాపురం చేసుకుంటుంది. అదే అతగాడికి నచ్చలేదు. రాత్రికి రాత్రే ఆమెతో గొడవ పెట్టుకుని చంపేశాడు. అసలు ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి. ఝార్ఖండ్(Jharkhand) లోని గయాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారాపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర (Husband), సావిత్రీదేవి భార్యభర్తలు. ఆమె.. అతడికి 12వ భార్య. ఆదివారం రాత్రి రామచంద్ర ఇంట్లో మద్యం సేవించాడు. అదే సమయంలో భార్య (wife) సావిత్రీదేవితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న రామచంద్ర.. భార్యపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. నిందితుడు రామచంద్ర ఇప్పటి వరకూ పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సావిత్రీదేవి 12వ భార్య. ఈమెకు ఇది వరకే పెళ్లైంది. మిగతా 11 మంది భార్యలు.. రామచంద్రతో గొడవ పెట్టుకుని అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ పదకొండు మంది భార్యలతో రామచంద్రకు పిల్లలు కలగలేదు. సావిత్రీదేవికి మాత్రం ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు అని గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
12 పెళ్లిళ్లు 11 మంది భార్యలు ఏం చేశారంటే
