బన్నీ టీజ్ చేసిన ఎన్టీఆర్ ఎందుకంటే

ఒక వైపు మెగా, నందమూరి అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఒకరి అభిమాన హీరోపై మరొకరు బూతులు తిట్టుకుంటూ.. ఆ హీరోల పరువు తీస్తుంటారు. మరోవైపు మాత్రం ఆ హీరోలు మా మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది కానీ.. మేమంతా ఒక్కటే.. అని చెప్పడమే కాకుండా సమయం వచ్చినప్పుడల్లా.. ఆ విషయం తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘RRR’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరి మధ్య సోదరబంధం ఉందని వారు వెల్లడించారు. అలాగే ఇద్దరిలో ఎవరి పుట్టినరోజు వచ్చినా.. ఇంట్లో చెప్పకుండా ఇద్దరం చెక్కేస్తామని కూడా సెలవిచ్చారు. అయితే ఫ్యాన్స్ మధ్య కోట్లాటలు మాత్రం తగ్గలేదు. తాజాగా మరోసారి యంగ్ టైగర్, మెగా హీరోతో ఉన్న బాండింగ్‌ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.

Leave a Reply

%d