కైకాల సత్యనారాయణ మృతి తీరని లోటు – మహేష్ యాదవ్

నటసార్వభౌమ, సహజ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ శుక్రవారం ఖైరతాబాద్‌ లైబ్రరి చౌరస్తాలో సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు మహేష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కొవ్వత్తులు వెలిగించి నివాకులు అర్చించారు. ఈ సందర్భంగా మహేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ సినిమా రంగంలోనే కాదు అందరితో కలిసిమెలిసి ఉండే కైకాల సత్యనారాయణ తనకు, తన కుటుంబానికి మంచి పరిచయం ఉందన్నారు. 777 సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ మృతి తీరని లోటన్నారు. ఆయన మృతికి నివాకులు అర్చిస్తూ ఖైరతాబాద్‌ లైబరి చౌరస్తాలో కైకాల సత్యనారాయణ చిత్రపటం వద్ద క్రొవ్వత్తులు వెలిగించి నివాళులు అర్చించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలంయాదవ్‌, రాజు, నర్సింగ్‌, మారయ్య యాదవ్‌, ప్రసాద్‌, రాజ్‌కుమార్‌లతో పొటు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

%d