ఇద్దరితో కాజోల్ లిప్‌లాక్.. వైరల్ అవుతున్న వీడియో

ఈ రోజుల్లో వెబ్ సిరీస్‌లకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం పలు ఓటీటీ సంస్థలు నిర్మించే ఒరిజినల్స్, సిరీసుల్లో నటిస్తూ ప్రేక్షకాభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సీనియర్ యాక్ట్రెస్ కాజోల్, ‘త్రిభంగా’ సినిమాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి, ఇటీవల ‘లస్ట్ స్టోరీస్ 2’ తో ఆకట్టకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది ట్రైయల్’ (The Trial). అమెరికన్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ ( The Good Wife) ఆధారంగా తెరకెక్కిన ఈ లీగల్, పొలిటికల్ డ్రామాకు సుపర్ణ్ వర్మ డైరెక్టర్. జూలై 14 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీలోకి ఏదైనా కొత్త సినిమా లేదా సిరీస్ వస్తే మూవీ లవర్స్, ట్రోలర్స్ అలాగే మీమ్స్ చేసే వాళ్లు, సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేస్తారో తెలిసిందే.

అలాగే ‘ది ట్రయల్’ సిరీస్‌లో కాజోల్ నటించిన రెండు సీన్లకు సంబంధించిన వీడియోలను మాత్రం తెగ వైరల్ చేసుస్తున్నారు. ఇంతకీ అంతలా ఆకట్టుకున్న ఆ సన్నివేశాలేంటో తెలుసా?. కాజోల్ ఇందులో లిప్ లాక్ సీన్స్ చేసింది. ఇద్దరు నటులతో ఆమె ముద్దులు కురిపించడం చూసి.. ‘48 ఏళ్ల వయసులో కాజోల్ ఇలాంటి సీన్లు చేసిందంటబ్బా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘20 సంవత్సరాల కూతుర్ని పెట్టుకుని ఇంత రొమాంటిక్ సీన్స్ చేయడమేంటి?’ అని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ సిరీస్‌లో కాజోల్ భర్తగా జిస్సు సేన్ గుప్తా, బాయ్‌ఫ్రెండ్‌గా ఆలయ్ ఖాన్ నటించారు. ఇద్దరితోనూ కాజోల్ లిప్ లాక్ సీన్స్ చేసింది. ఆ సీన్స్ గురించి ఆలయ్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కాజోల్ అంటే ఎప్పటినుండో తనకు క్రష్ అని, ఆమెతో అలాంటి సీన్స్ చేయడం ఒక కొత్త అనుభూతి అని చెప్పుకొచ్చారు. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన హీరోయిన్లలో కాజోల్ ఒకరు. 30 ఏళ్లుగా ఆమె యాక్టింగ్ చూస్తున్నాను. అయితే ఈ సిరీస్‌లో ముద్దు సీన్ కోసం కాజోల్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలని దర్శకుడిని అడిగాను. కానీ, సీన్ చేస్తున్నప్పుడు సిగ్గుగా కానీ, ఇబ్బందిగా కానీ ఫీల్ కాలేదు.అదొక ప్రొఫెషనల్ షూట్ కాబట్టి టేక్ చేయడానికి ముందు మూడు, నాలుగు సార్లు రిహార్సల్స్ చేశాం. మానిటర్ దగ్గరకెళ్లి చూసుకున్నప్పుడు సీన్ బాగా వచ్చిందనిపించింది. ఇక కాజోల్ నాతో ‘థ్యాంక్యూ’ మై డార్లింగ్’ అని అన్నారు అని చెప్పుకొచ్చారాయన.

Leave a Reply

%d