తెదేపా సభలో అపశ్రుతి.. ఐదుగురికిపైగా మృతి

నెల్లూరు జిల్లా కందుకూరు లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని భావిస్తున్న చంద్రబాబు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లి అక్కడి శ్రేణులను కాస్త ఉత్తేజపరిచి వెనక్కి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట ఏర్పడడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో వెంటనే పక్కనే ఉన్న కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారని తెలుస్తోంది. అలా పడిపోయిన వారికి గాయాలు కాగా ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. అనంతరం చంద్రబాబు ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం మనసు కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున 10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం సాయంత్రం చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపడుతున్నారు.

Leave a Reply

%d