భర్త పుట్టిన రోజునాడు పూల్ ఫొటో షేర్ చేసిన కరీనా కపూర్

బాలీవుడ్ లో అన్యోన్యంగా ఉండే దంపతుల్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంట ఒకటి. కరీనాను సైఫ్ రెండో వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు పుట్టారు. మరోవైపు ఈరోజ సైఫ్ 53వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కరీనా ఒక పూల్ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు కూడా సైఫ్ తన ముందే ఉండి నవ్వుతున్నాడని, ఇన్స్టాలో తాను ఏ పిక్ పెట్టాలో కూడా తానే డిసైడ్ చేశాడని… ఆయన ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించింది. నా జాన్ నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని కరీనా ఆకాంక్షించింది. తన గొప్ప ప్రేమికుడికి హ్యాపీ బర్త్ డే అని, తనలా మరెవరూ లేరని తెలిపింది. ఉదారత్వం, చిలిపితనం, దయ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా రాయగలనని… కానీ కేక్ తినాలిగా అంటూ రాసుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘దేవర’లో సైఫ్ నటిస్తున్నాడు. ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’లో కరీనా నటిస్తోంది.

 

Leave a Reply

%d bloggers like this: