కరీంనగర్ ఆంటీ దాని కోసం 25 లక్షలు ఇచ్చింది చివరికి

కరీంనగర్ సిటీలోని భగత్ నగర్ లో సరిత అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, సరిత ఆమెకు పరిచయం ఉన్న వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి గతంలో రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఇక డబ్బులు ఇచ్చి చాలా రోజలే అవుతుంది. అయితే, గత కొంత కాలం నుంచి సరిత ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంకటేష్ ను కోరింది. ఈ రోజు, రేపు అంటూ కాలాన్ని వెల్లదీస్తూ వచ్చాడు.

ఇక అదే పనిగా సరిత అతడిని రోజూ అడగడం మొదలు పెట్టింది. దీంతో వెంకటేష్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక సరిత టార్చర్ ను భరించలేని వెంకటేష్.. ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే వెంకటేష్ ఇటీవల సరితను పక్కా ప్లాన్ తో అతి దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సరిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Leave a Reply

%d bloggers like this: