కర్నాట ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ రాజకీయాలు మరింత రంగులు మారుతున్నాయి. ఇప్పటికే సీఎం పదవి తనకంటే తనకే ఇవ్వాలని అదిష్టానానికి తమ వినతులను అందజేశారు. తాజాగా డీకే వ్యాఖ్యలు పెనుదూమారం రేపుతున్నాయి. అయితే అదిష్టానం మాత్రం సిద్దిరాామయ్యకే మెగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమెరికా ప్రయాణం మరింత కలరవరపెడుతోంది. పార్టీలో తీసుకోవాల్సిన సమయంలో రాహుల్ యాత్ర మరింత హీట్ పెంచింది. కర్నాటక సీఎం ఖరాను పూర్తిగా పార్టీ అధ్యక్షుడు ఖర్గేకే వదిలేసినట్లు సమాచారం. అయితే ఇటు సిద్దిరామయ్య, అటు డీకే విజయ్ కుమార్లు తమ పాంతాలను వీడడం లేదు. ఎవరో ఒకరు పట్టు వదిలితే తప్పాా… సీఎం సీటు అంశం ఖరారు అయ్యేట్లుగా లేదు.
For More News Click: https://eenadunews.co.in/
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఇందుకోసం ఖర్గే నివాసానికి సిద్ధూ వచ్చారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్… ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. డీకే వెళ్లిన కాసేపటికి సిద్ధరామయ్య వచ్చారు. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది.