ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15న ఉదయం ఢిల్లీకి వెళ్లారు. లిక్కర్‌స్కామ్‌లో విచారణ ఎదుర్కోవడానికి ముందు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టినట్టుగానే, రెండో విడత విచారణకు ముందు మరో రూపంలో ఆందోళనకు ప్లాన్ చేశారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరేడియన్హోటల్లో రౌండ్‌టేబుల్‌సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. మార్చి 16న కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
కవిత మరో ఆందోళనకు ప్లాన్
