ఈడీ చేతిలో కవిత డిలిట్ వాట్సాప్ చాట్ ?

ఢిల్లీ లిక్కర్ స్కాం చివరి దశకు చేరుకున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే అనేక మందిని విచారించిన ఈడీ వివరాలను సేకరించి ఆయా అనుమానితులకు నోటిసులను పంపింది. అయితే నోటిసులు అందుకున్న కొంతమంది విచారణకు హాజరై విచారణ ఎదుర్కొన్నారు మరికొందరు డుమ్మా కొట్టారు. కాగా సౌత్ గ్రూప్ నుండి ప్రధానంగా వినిపిస్తున్న పేరు సీఎం కూతురు కవిత. ఆమెకు కూడా ఇటీవల నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె విచారణ కు హాజరు కాకుండా తమ ప్రతినిధిని పంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. విచారణ హాజరుకాకుండా ఎలా అనే అంశాలపై న్యాయనిపుణులతో చర్చించి సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఆ తరువాత మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పుడు విచారణ మాత్రం తప్పకుండా హాజరు కావాల్సిన సమయం వచ్చింది. దీంతో నిన్న రాత్రి కేటీఆర్, సంతోష్, కుటుబం సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.

విచారణలో భాగంగా ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కవిత సౌత్ గ్రూప్ లో చేసిన వాట్సాప్ చాట్ ని డిలిట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.  కాగా ఆ వాట్సాప్ తిరిగి ఈడీ సాంకేతిక నిపుణులతో కలిసి సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్​ అయ్యారు. లిక్కర్​స్కాంలో తాను కవిత బినామీని అని విచారణలో ఒప్పుకున్న అరుణ్​ రామచంద్ర పిళ్లై ఆ స్టేట్​మెంట్​విత్ డ్రా చేసుకోవడానికి రౌస్​ఎవెన్యూ కోర్టులో పిటిషన్​వేశారు. కవిత పేరు ప్రస్తావించకుండానే ఈడీ ఆమె సెంట్రిక్​గానే దానిపై కౌంటర్​పిటిషన్​దాఖలు చేసింది. కవితతో పాటు అరుణ్​రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్​బుచ్చిబాబును ఈడీ కన్​ఫ్రంటేషన్ (ముఖాముఖి) విచారణ చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో పిళ్లై ఈడీ కస్టడీని కోర్టు పొడగిస్తూ వస్తోంది.

 

Leave a Reply

%d