దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్నట్లు కనబడుతోంది. ఈ కేసులో ప్రధానంగా తెర మీదకు వచ్చిన భారస పార్టీ ఎమ్మెల్సీ కవిత రెండోసారి విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై దేశంలో తలపండిన న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఈ దూమారం నుండి బయటపడాలనే కోణంలో భారస అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ అంశం మరింత ప్రధాన్యాత సంతరించుకుంది.
ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన సమయంలో గైర్హాజరు కావడం, సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. కేసు సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి విచారణకు హాజరు కాలేనని, తీర్పు వచ్చిన చూద్దాం అనే దాటవేశే ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఈడీ కూడా ఈ కేసు సీరియస్ ఫోకస్ పెట్టిందనే చెప్పుకోవాలి. ఈడీ కూడా అంతే రేంజ్లో సుప్రీం కోర్టులో కేవియట్ వేసింది. తమ వాదన వినకుండా ఎటువంటి తీర్పు ఇవ్వకూడదని. దీంతో కవిత ముందు ఉన్న దారులన్ని మూసుకపోయాని తేలిపోయింది.
అయితే ఇప్పుడు కవిత విచారణకు హాజరుకావడం వల్ల కేసు తుది దశకు చేరే అవకాశం ఉంది. కవిత ప్రధాన బినామీగా ఉన్న పిళ్లై, అడిటర్ బుచ్చిబాబు, సౌత్ గ్రూప్ నుండి మాంగుట్ల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు, జైల్లో ఉన్న సిసోడియాని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ చెపట్టాలని ఈడీ ప్లాన్. కానీ అలా విచారణ చేేపడితే నిజాలు బయటకి వచ్చి స్కాం బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయని కాబట్టి విచారణ కవిత హాజరు కావడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే నోటీసులుు అందుకున్నఏపీ ఎంపీ మాగుంట్ల శ్రీనివాస్ రెడ్డి సైతం కూడా విచారణ ఎగ్గోట్టారు.
ఇక కవిత తప్పకుండా ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సమయం వచ్చింది. అయితే ఇక్కడ మరో బూచీని కూడా చూపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంగా ఉన్నానని హాస్పిటల్ లో ఆడ్మిట్ అవుతారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవన్ని తేలాలంటే… మరో కొన్ని గంటల ఆగితే అన్ని తేలుతాయి.