ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారస ఎమ్మెల్సీ ఈడీ విచారణకు భయపడిందా అనేది సందేహంగా మారింది. ఏ తప్పు చేయకపోతే ఈడీ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని విపక్షలు ప్రశ్నిస్తున్నాయి. విచారణకు హాజరవ్వాల్సిన కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు షాకిచ్చారు. 16వ తేదీన విచారణకు హాజరవ్వాల్సుంటుందని ఈడీ ఉన్నతాధికారులు 11వ తేదీన జరిగిన విచారణ సందర్భంగానే నోటీసిచ్చారు. దానికి తగ్గట్లే కవిత కూడా ప్రిపేర్ అయ్యారు. ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్న కవిత గురువారం ఈడీ విచారణకు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఉదయం 11 గంటలకు విచారణ నిమ్మితం కవిత ఈడీ ఆఫీసుకు చేరుకోవాలి. మొదటిసారి విచారణ సందర్భంగా చేసినట్లే కెసిఆర్ ఇంటిదగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. రెగ్యులర్ పోలీసులు కూడా కెసిఆర్ ఇంటికి చేరుకున్నారు. 10.30 గంటలకు కవిత ఇంటినుండి బయలుదేరుతారని అనుకున్నారు. కానీ ఎంతసేపటికీ ఇంట్లోనుండి రాలేదు. 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సిన కవిత టైం అయిపోయినా ఎందుకు హాజరుకాలేదో అర్ధంకాలేదు.
విచారణకు హాజరైతే పిళ్లై ముందు కూర్చొబెట్టి విచారణ చేస్తే నిజాలు భయటికి వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అనుమానంతో విచారణకు గైరాజరయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.