లిక్కర్ స్కాం కథ కంచికేనా ?

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ముఖ్య‌మంత్రి కూతురు క‌విత అంశం కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఢిల్లీ బీజేపీ నేతలు ఇవిగో ఆధారాలు అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆప్ పార్టీకి ఫండ్స్ ఇచ్చార‌నే ఆరోప‌ణ‌ల‌తో హీట్ పెరిగింది. సీబీఐ అరెస్టులు, ఈడీ ద‌ర్యాప్తుల‌తో ఊపందుకుంది. హైద‌రాబాద్ లో కవిత ఇంట్లో సీబీఐ విచారించింది. 91 సీఆర్పీసీ ప్ర‌కారం ఎల‌క్ట్రానిక్స్ ఎవిడెన్స్ స‌మ‌కూర్చాల‌ని ఆదేశించింది. కానీ, ఎప్పుడు? ఎలా? ఎంటి? అనేది బయ‌ట‌కు రావడం లేదు. 10 సెల్ ఫోన్స్ ధ్వంసం చేశార‌ని ఆరోపణ‌లు ఉన్నాయి. లిక్క‌ర్ స్కాంకు సంబంధం ఉన్నవారు 100 ఫోన్స్ ప‌గ‌ల‌గొట్టార‌ని చార్జ్ షీట్ల‌లో పేర్కొన్నారు. అయితే.. అవేమీ ఇప్పుడు చ‌ర్చ‌కు రావ‌డం లేదు. అంటే ఆధారాలు లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మా? ద‌ర్యాప్తు ఏజెన్సీలు తెలిసీ తెలియని ఇన్ఫర్మేషన్ తోనే కోర్టులో ప్ర‌స్తావించారా? లేక జేబు సంస్ధ‌లుగా విమ‌ర్శ‌లు వినిస్తున్న సంద‌ర్భంలో రాజీ కుదిరిందా? అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

 

 

Leave a Reply

%d