ఢిల్లీ లిక్కర్ స్కాంలో అంతా సమిసిపోతుంది అనే సమయంలో పిడుగులాంటి వార్త కవితను కలవర పెడుతోంది. జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పటికే కవితకు నమ్మదగిన మనిషి, అరుణ్ ని కలిస్తే నన్ను కలిసినట్టే అని చెప్పకుంటున్న అరుణ్ పిళ్లైకి టీఆర్ ఎస్ భవన్ లో 15 కోట్ల డబ్బులు ఇచ్చానని జైలు నుండి లేఖ విడుదల చేశారు. ఇక ఇప్పుడు
కవితతో సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్ అంటూ లాయర్ కొన్ని స్క్రీన్ షాట్లను రిలీజ్ చేశారు. అక్కా..డెలివర్డ్ అనే సమాచారం ఈ చాట్‌లో ప్రత్యేకంగా ఉంది.
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. ఈ సారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్ అంటూ సుఖేష్ లాయర్ దీన్ని ఢిల్లీలో విడుదల చేశారు. ఇందులో కవితను అక్కా అని సుఖేష్ చంద్రశేఖర్ సంబోధించారు. ఆ చాట్ ఏదో అంశానికి సంబంధించి డెలివరీ చేసినట్లుగా ఉంది. ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చాట్‌లో పలు అంశాలు గతంలో సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖలతో పోలి ఉంది. గతంలో రెండు సార్లు లేఖలను సుకేష్ తన లాయర్ ద్వారా విడుదల చేశారు. అందులో కేజ్రీవాల్ చెప్పినట్లుగా తాను రూ. పదిహేను కోట్లను.. హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వరుసగా రిలీజ్ చేస్తానని కూడా ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పుడు కవితతో జరిగిన స్క్రీన్ షాట్లను లాయర్ బయటపెట్టడం రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పటికి రెండు సార్లు లేఖవు రాశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ కు రూ.15 కోట్లు చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. ఈ లేఖ కలకలం రేగుతోంది. త్వరలోనే కేజ్రీవాల్ తో మాట్లాడిన వాట్సాప్ చాట్ బయటపెడతానని సుఖేష్ లాయర్ ప్రకటించారు. ఇప్పుడు కవితతో జరిగిన చాట్ స్క్రీన్ షాట్లను రిలీజ్ చేశారు.
2020లో బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చినట్లు సుఖేష్ లేఖలో తెలిపారు. కేజ్రీవాల్ టార్గెట్ గా మరోసారి సుఖేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు చెప్పినట్లు డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. వారంలో కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు వస్తాయన్నారు. చాటింగ్ లో కోడ్ పదాలు వాడారన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానన్నారు. కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ అన్నారు. ఈ వివరాలే వాట్సాప్ చాట్‌లో ఉన్నాయి.
దిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పటికే లేఖ ద్వారా వెల్లడించారు. కేజ్రీవాల్ నేను మీకు 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్‌ను చూపించబోతున్నానని ఇటీవల రాసిన లేఖలో వెల్లడించారు. అయితే కవితతో జరిగిన చాట్ ను రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గామారింది. టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మద్యం కేసు నిందితుల్లో ఒకరికి ఈ నగదు ఇచ్చినట్లు తెలిపారు. ఈ 15 కిలోల నెయ్యి హైదరాబాద్‌లో చేరవేయాలని కేజ్రీవాల్ కోరినట్లు లేఖలో సుఖేశ్ ఆరోపించారు. ఇప్పటికే 5 నెయ్యి కేసులు హైదరాబాద్‌కు పంపించినట్లుగా చెప్పారు. హైదారబాద్‌కు మొత్తం రూ.75 కోట్లు చేరవేశామని పేర్కొన్నారు. ఇంతటితో ఆగిపోవని.. ఇంకా స్క్రీన్ షాట్లు వెలుగులోకి వస్తాయని సుకేష్ చంద్రశేఖర్ లాయర్ చెబుతున్నారు.
రిలీజ్ చేసిన చాట్ ఏముందంటే ( తెలుగులో )
AK బ్రదర్ ప్యాకేజి ఇవ్వాల్సి ఉంది – సుకేశ్
అవును.ఓకే – కవిత
దాన్ని నేను JH కు పంపించాలా? – సుకేశ్
నోనో, అరుణ్‌ను నీకు కాల్ చేయమని చెబుతా – కవిత
దాన్ని ఆఫీసుకు పంపించాలి – కవిత
ఓకే అక్కా.. మీరు చెప్పినట్టే చేస్తా – సుకేశ్
అతను నీకు త్వరలో కాల్ చేస్తాడు – కవిత
దాన్ని ఈ రోజే మీకు పంపించాలని SJ బ్రదర్ చెప్పారు – సుకేశ్
అవును – కవిత
నేను మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటాను అక్కా – సుకేశ్
అంతా బాగానే ఉంది కదా? నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? – కవిత
అడిగినందుకు థ్యాంక్స్ అక్కా. ఆయన కీమో చికిత్స తీసుకుంటున్నారు – సుకేశ్
ఆయన బయటపడతారు – కవిత
అవును అక్కా. దేవుడు అనుగ్రహిస్తాడు – సుకేశ్
టేక్ కేర్, మళ్లీ తర్వాత మాట్లాడతా – కవిత
ఓకే అక్కా, ఎనీటైమ్. కేసీఆర్ గారికి నా నమస్కారాలు చెప్పండి – సుకేశ్
అక్కా. సరుకు డెలివరీ అయింది – సుకేశ్
ఓకే – కవిత
అక్కా.. దయచేసి AK లేదా SJ కు inform చేయగలరు – సుకేశ్
మనీశ్‌తో మాట్లాడా – కవిత
ఓకే అక్కా.. థ్యాంక్స్ – కవిత