దేశంలోని ప్రజలకు మంచినీళ్లు ఇవ్వడానికి పుట్టుకొచ్చిన పార్టీ భారత రాష్ట్ర సమితి అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం జిల్లాలో భారస ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో భారతీయ జనతా పార్టీ వల్ల ప్రజలు అవస్త పడుతున్నారుని విమర్శించారు. దేశంలో మేక్ ఇన్ ఇండియా అన్నారు కానీ అది జోక్ ఇన్ ఇండియా మారిందని హెద్దేవా చేశారు. ఈ సభకు మూడు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. కానీ ఆయా రాష్ట్రాల సీఎం ప్రసంగాల్లో ఎక్కడా కూడా జోష్ కనిపించలేదు. బీజేపీ తిట్టడం కోసమే సభ ఏర్పాటు చేశానట్టు కనిపించింది అంతేకానీ దేశ ప్రజలకు ఏం చేస్తారు అని స్పష్టంగా చెప్పలేకపోయారు. కరెంట్, మంచినీళ్లు తప్పా… కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఫైరింగ్ కనిపించలేదు.
మంచినీళ్ల కోసం పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ – కేసీఆర్
