డిప్యూటి స్పీకర్ వియ్యంకుడిని బెదిరించిన కేసీఆర్ అన్న కొడుకు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండదండలు ఉన్నాయని గిరిజన భూములను కబ్జా చేస్తున్నారు వారి బంధువులు. ఈ భూముల విషయంలో ఉపశాసన సభాధిపతి పద్మారావు వియ్యంకుడికి సైతం హెచ్చరించారనే ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ నగర శివార్లో భూములకు రెక్కలు వచ్చాయనే చెప్పుకోవాలి. నగరం నలువైపులు భూముల ధరలు ఆకాశాన్నంటడంతో పెద్దలు కళ్లు పేదోళ్ల భూములపై పడ్డాయి. రెండు ఎకరాలకు డబ్బులు ఇచ్చి పదెకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని గిరిజనులపై సీఎం కేసీఆర్ బంధువులు మంజులరావు, కన్నారావులు ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గిరిజనలకు మద్దత్తుగా నిలిచిన పద్మారావు వియ్యంకుడు బద్రి నారాయణ గౌడ్ కి సీఎం బంధువులు హెచ్చరించారని తెలుస్తోంది. బద్రి, ఇతరుల పేరున ఉన్న భూమి లో కూడా గోడ నిర్మాణం అడ్డు కోవద్దని బద్రి గౌడ్ కు కన్నరావు చెప్పారని.. నాలుగు కోట్లు పలికే భూమి కోటి కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కన్నారావు.  ఘట్కేసర్ మండలం ఏదులబాద్ శివారు ఘనపూర్ పంచాయితీ పకీర్ టెక్కీ తండా పరిధిలోని సర్వే నంబర్ 1092,1093,1095, లలో గోడ నిర్మాణం చేపట్టారు. అంతకుముందే మరికొంత గిరిజనుల భూమి, చెరువు ఆక్రమించి వెంచర్ వేసిన కేసిఆర్ మరో బంధువు కు చెందిన అవని ఇన్ఫ్రా గ్రూప్ అని తెలుస్తోంది.

Leave a Reply

%d