కోకాపేట ప్రభుత్వ భూములు..తెలంగాణ రాష్ట్ర ఖజానా నింపుతున్నాయి. కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్-2లో ప్రభుత్వ భూములను వేలం కొనసాగుతుంది. 10వ నెంబర్ ప్లాట్‌కి సంబంధించిన వేలంలో ఎకరా 100 కోట్ల మార్క్‌ని టచ్‌చేసింది. ఇప్పటివరకైతే ఇదే ఆల్‌టైమ్ రికార్డు ధరగా నమోదయినట్టు తెలుస్తోంది.
ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి. నాలుగు ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఒక ఎకరం దాదాపు రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51 కోట్లు పలికింది. గజం సరాసరి రూ. 1.5 లక్షలు పలికింది. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.