సముద్ర తీరాన అందమైన రిసార్ట్‌ – అందులో వ్యభిచారం

సువిశాల సాగరతీరం.. ఆహ్లాదాన్ని పంచే ఇసుకతిన్నెలు.. మరోపక్క ఎగిసి పడే అలలు.. ఈ సుందర దృశ్యాన్ని తిలకిస్తూ సరదాగా సమయం గడపాలనే సాగర తీరానికి వస్తుంటారు.. అదే సాగరతీరంలో ఏదైనా రిసార్ట్స్‌ ఉంటే అవసరమైతే అక్కడే ఉండిపోయి సముద్రాన్ని ఎంజాయ్‌ చేస్తుంటారు.. కానీ ఓ జూద బృందం మాత్రం రాత్రి పగలు అన్న తేడా లేకుండా రిసార్ట్స్‌లో తిష్టవేసి జూదాలు జోరుగా ఆడేస్తున్నారు.. ఈ సంగతి రిసార్ట్స్‌ యాజమాన్యానికి తెలిసినా అవేమీ పట్టించుకోకుండా జూదాలతో జోరుమీదున్నవారికి తగిన సమయాల్లో కావాల్సినవన్నీ అందిస్తూ తగినంత డబ్బు వసూళ్లు చేస్తోంది..  గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న ఈ తంతు మొత్తం మీద ఖాకీలకు చేరింది.. అకస్మాత్తుగా దాడులు చేసిన పోలీసులకు 14 మంది పేకాట రాయుళ్లు అడ్డంగా దొరికి పోయారు.. 7 బైకులు, 11 సెల్‌ఫోన్లుతోపాటు వారి వద్దనుంచి రూ.లక్షా పన్నెండు వందలు స్వాధీనం చేసుకున్నారు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు సముద్ర రిసార్ట్స్‌పై దాడి చేసిన పోలీసులు జూదగాళ్లను అరెస్ట్‌చేశారు.

ఓడలరేవు సముద్ర రిసార్ట్స్‌లో గత కొన్ని రోజులుగా కొందరు రూమ్‌లు అద్దెకు తీసుకుని అందులో పేకాట క్లబ్‌ పెట్టేశారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్న పేకాట వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. అయితే ఈ సమాచారం మొత్తం మీద జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ వరకు చేరింది. దీంతో ఎస్పీ, డీఎస్పీ అంబికాప్రసాద్‌, అమలాపురం రూరల్‌ సీఐ వీరబాబు ఆదేశాలతో ఎస్సై శ్రీను నాయక్‌ సిబ్బందితో రంగంలోకి దిగారు. ఎటువంటి హడావిడి లేకుండా అకస్మాత్తుగా రిసార్ట్స్‌పై దాడులు చేసిన పోలీసులుకు ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది అడ్డంగా దొరికి పోయారు. పేకాటలో మంచి బిజీగా ఉన్న పేకటరాయుళ్లు పోలీసుల ఎంట్రీతో అవాక్కయ్యారు. ఏ ఒక్కరూ పారిపోకుండా సిబ్బందిని అప్రమత్తం చేసిన ఎస్సై అందిరినీ అదుపులోకి తీసుకుని అల్లవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 7 బైక్‌లు, 11 సెల్‌ఫోన్లు  తోపాటు రూ.101250 నగదును స్వాదీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు..

ఓడలరేవు సముద్రతీరంలో ఉన్న ఈ ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అసంఘిక కార్యకలాపాలకు జోరుగా సాగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే రిసార్స్‌లో కాకినాడ నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులకు అమ్మాయిలు, కొందరు విటులు అడ్డంగా దొరికిపోయారు. అప్పట్లో రిసార్ట్స్‌పైనా కేసులు నమోదు చేశారు. ఆ తరువాత కూడా చాలా సందర్భాల్లో ఇదే రిసార్ట్స్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓడలరేవు సముద్రతీరంలో ఉన్న ఈ రిసార్ట్స్‌ అమలాపురం పట్టణానికి చెందిన ఓ వైసీపీ నాయకునిది కాగా ప్రస్తుతం లీజు ప్రాతిపదికన వేరేవాళ్ల నిర్వహణలో కొనసాగుతోంది.

Leave a Reply

%d