హీరోయిన్ కృతి శెట్టిని పక్కన పెట్టిన డైరెక్టర్ ఎందుకంటే

చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి (Krithi Shetty). తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppena) తోనే బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘ఉప్పెన’ ఇచ్చిన జోష్‌తో వరుసగా సినిమాలను పట్టాలెక్కించింది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి మూవీస్‌ని చేసింది. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న దశలో కోలీవుడ్ నుంచి ఆమెకు భారీ అవకాశం వచ్చింది. స్టార్ హీరో సూర్య (Surya) కు జోడీగా నటించే ఛాన్స్‌ను దక్కించుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అనంతరం ఈ చిత్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ మూవీ నుంచి ఆమెను తప్పించినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.

Roshni-Prakash.jpg

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), రియలిస్టిక్ డైరెక్టర్ బాల (Bala) కలసి ఓ సినిమా చేయాలి. ఈ చిత్రానికి ‘వనన్‌గాన్’ (Vanangaan) అని టైటిల్ పెట్టారు. కన్యాకుమారిలో దాదాపుగా 40రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. హీరో, డైరెక్టర్‌కు మధ్య ఉన్న సృజనాత్మక విభేదాలతో ఈ మూవీ ఆగిపోయింది. తాజాగా అరుణ్ విజయ్ (Arun Vijay) తో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. హీరోయిన్‌గా మాత్రం కృతి శెట్టి‌ని తప్పించారని సమాచారం అందుతుంది. ఆమె స్థానంలో మరొకరిని హీరోయిన్‌గా చిత్రబృందం తీసుకుందట. పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న రోష్ని ప్రకాష్ (Roshni Prakash) ను హీరోయిన్‌ పాత్రకు ఎంపిక చేసుకున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ‘వనన్‌గాన్’ ను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: