కేటీఆర్ మీ నాన్న దెబ్బ కేంద్రానికి తగలలేదా ఏందీ? – భాజపా

కేసీఆర్ దెబ్బకు కేంద్రం అబ్బా అంది.. అందుకే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఆ మరు రోజు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీ కరణ ఆగలేదని స్పష్టం చేసింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని, సంస్థను బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై ఇప్పుడు కేటీఆర్ ఏం సమాధానం చెబుతారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

%d